జీజీహెచ్‌లో లైంగిక వేధింపుల ఆరోపణలు.. అలా ఎలా అడుగుతావంటూ..
Harrsement Issue In Nellore GGH. ఓ పక్క జనాలు కరోనాతో కొట్టమిట్టాడుతుంటే.. మరోవైపు బాధ్యతగా వ్యవహరించాల్సిన
By Medi Samrat Published on 4 Jun 2021 12:18 PM GMT
ఓ పక్క జనాలు కరోనాతో కొట్టమిట్టాడుతుంటే.. మరోవైపు బాధ్యతగా వ్యవహరించాల్సిన అధికారులు బరితెగిస్తున్నారు. ఏపీలోని నెల్లూరు జీజీహెచ్ ఆస్పత్రి ఉన్నతాధికారిపై లైంగిక వేధింపుల ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. సూపరింటెండెంట్, వైద్య విద్యార్థినికి మధ్య జరిగిన ఫోన్ సంభాషణకు సంబంధించిన ఓ ఆడియో ఇప్పుడు సంచలనంగా మారింది.
కొవిడ్ విధుల్లో ఉన్న ఓ వైద్య విద్యార్థినిని ఆ ఉన్నతాధికారి లైంగిక వేధింపులకు గురిచేశాడు. అతని వేధింపులు తట్టుకోలేక ఆ వైద్య విద్యార్థిని అధికారిపై ఎదురు తిరిగింది. ఫోన్ లోనే డైరెక్ట్‌గా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి ఇద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సదరు ఉన్నతాధికారి తనను ఎలా వేధించింది ఆ సంభాషణలో బాధితురాలు వెల్లడించింది. కారులో ఒంటరిగా రావాలని.. ఎలా అడుగుతావంటూ నిలదీసింది.
చాలారోజులుగా వ్యవహారం నడుస్తున్నా సదరు వైద్యవిద్యార్ధిని బయటికి చెప్పుకోలుకపోయిందని ఆ సంబాషణ ద్వారా తెలుస్తోంది. ఆ ఉన్నతాధికారి, వైద్య విద్యార్థినికి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో ఇప్పుడు సంచలనంగా మారింది. కీచక ఉన్నతాధికారిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. విద్యార్థినులపై ఉన్నతాధికారి లైంగిక వేధింపుల ఘటనను జిల్లా యంత్రాంగం సీరియస్ గా తీసుకుంది. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.