ఆడ పిల్ల పుట్టిందని అత్తమామల వేధింపులు.. 3 నెలల కూతురిని వాటర్‌ ట్యాంక్‌లో ముంచి చంపిన తల్లి.!

Harassed over giving birth to girl, woman drowns 3 month old daughter in Mumbai. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఆడపిల్లకు జన్మనిచ్చిందని భర్త, అత్తమామలు పదే పదే వేధించడంతో ఓ కోడలు

By అంజి  Published on  3 Dec 2021 9:12 AM GMT
ఆడ పిల్ల పుట్టిందని అత్తమామల వేధింపులు.. 3 నెలల కూతురిని వాటర్‌ ట్యాంక్‌లో ముంచి చంపిన తల్లి.!

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఆడపిల్లకు జన్మనిచ్చిందని భర్త, అత్తమామలు పదే పదే వేధించడంతో ఓ కోడలు తన 3 నెలల కూతురిని ఇంటి వద్ద ఉన్న వాటర్‌ ట్యాంక్‌లో ముంచి చంపేసింది. ఈ దారుణ ఘటన సెంట్రల్‌ ముంబైలోని కాలాచౌకి ప్రాంతంలో జరిగింది. మంగళవారం కాలాచౌకీలోని ఫెర్‌బందర్ ప్రాంతంలోని సంఘర్ష్ సదన్ భవనంలో ఈ ఘటన చోటుచేసుకుందని అధికారి తెలిపారు. మొదట తన కూతురిని ఓ మహిళ కిడ్నాప్‌ చేసిందని తల్లి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ తర్వాత అనుమానిత మహిళ స్కెచ్‌ను కూడా పోలీసులు విడుదల చేశారు. దర్యాప్తులో భాగంగా అనుమానితులను గుర్తించేందుకు బృందాలను ఏర్పాటు చేసి ఘటన జరిగిన ప్రాంతంలో సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు.

అయితే ఈ ఘటన గురించి మరింత సమాచారం తెలుసుకునేందుకు 3 నెలల చిన్నారి తల్లి, తండ్రిని క్రైమ్ బ్రాంచ్ బృందం పిలిచిందని అధికారి తెలిపారు. విచారణలో పోలీసులు మృతురాలి తల్లిపై అనుమానం వ్యక్తం చేసి.. శిశువును చంపారా అని ఆమెను అడిగారు. దీంతో ఆమె విరిగిపోయి మనసుతో నేరాన్ని తానే చేశానని చెప్పింది. ఇంట్లోని లాఫ్ట్‌లో ఉంచిన వాటర్ ట్యాంక్‌లో పసికందును పడేసినట్లు నిందితురాలు వెల్లడించినట్లు అధికారి తెలిపారు. నిందితురాలికి 2011లో పెళ్లై 2013లో గర్భం దాల్చడంతో అత్తమామలు చేతబడి చేసి బిడ్డ లింగనిర్ధారణ చేసి అబార్షన్ చేయించారని పోలీసులు తెలిపారు.

మహిళ కూడా అదే విధంగా మరో మూడు అబార్షన్లు చేయించుకోవలసి వచ్చిందని, ఆమె మళ్లీ గర్భం దాల్చినప్పుడు గర్భం కొనసాగించేందుకు అనుమతించారని అధికారి తెలిపారు. నిందితురాలికి ఆగస్ట్‌లో బలవంతంగా సిజేరియన్ చేయగా ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చిందని, బిడ్డ పుట్టిన తర్వాత కుటుంబసభ్యులు ఆమెను బహిష్కరించారని ఆరోపించారు. నిందితురాలు ఒంటరిగా ఉండడంతో తల్లిదండ్రులు ఆమెతో కలిసి జీవించేందుకు వచ్చారని తెలిపారు. వాటర్ ట్యాంక్ నుండి చిన్నారి మృతదేహాన్ని పోలీసులు వెలికి తీశారని, తదుపరి విచారణ జరుగుతోందని అధికారి తెలిపారు.

Next Story