ఓ యోగా గురువును ఓ వ్యక్తి బతికుండగానే పాతిపెట్టాడు. హర్యానాలోని చార్ఖీ దాద్రిలో తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ ఒక వ్యక్తి అతన్ని సజీవంగా పాతిపెట్టాడు. రోహ్‌తక్‌లోని ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో యోగా గురువుగా పనిచేస్తున్న బాధితుడు జగదీప్‌ను కిడ్నాప్ చేసి ఏడు అడుగుల లోతైన గొయ్యిలో సజీవంగా పాతిపెట్టారు. నేరం జరిగిన మూడు నెలల తర్వాత, మార్చి 24న అతని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
డిసెంబర్ 24న పని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా జగదీప్‌ను కొందరు అపహరించారు. నిందితులు అతని చేతులు, కాళ్ళు కట్టివేసి, నోటికి టేపులు కూడా కట్టాడు. ఆ తర్వాత అతన్ని ఓ పొలానికి తీసుకెళ్లారు, అక్కడ నిందితులు బోరుబావి కోసం అని ఒక కూలీకి చెప్పి లోతైన గొయ్యి తవ్వించాడు. ఆ తర్వాత జగదీప్‌ను ఆ గొయ్యిలో సజీవంగా పాతిపెట్టారు కిడ్నాప్ జరిగిన తర్వాతా జగదీప్ మిస్సింగ్ కేసు నమోదు చేశారు. పోలీసులు మూడు నెలల పాటు దర్యాప్తు ప్రారంభించారు.
జగదీప్ కాల్ రికార్డులు ఈ కేసులో కీలకమైన ఆధారాన్ని అందించాయి. చివరికి ధరంపాల్, హర్దీప్ అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి కుల్దీప్ తెలిపారు. విచారణ సమయంలో, నిందితులు హత్యకు సంబంధించిన భయంకరమైన వివరాలను వెల్లడించారు. జగదీప్ అద్దెకు ఉంటున్న భవనంలో నివసిస్తున్న ఒక మహిళతో అక్రమ సంబంధం ఉందని ఆరోపించారు. ఆ మహిళ భర్త ఈ హత్యకు పథకం పన్నాడు. జగదీప్‌ను సజీవంగా పాతిపెట్టడానికి ముందు పదునైన ఆయుధంతో దాడి చేశారా అనే దానిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.