జిమ్ ట్రైనర్ చేతిలో మోసపోయా : టాలీవుడ్ జూనియర్ ఆర్టిస్ట్
30 ఏళ్ల జిమ్ ట్రైనర్ టాలీవుడ్ జూనియర్ ఆర్టిస్ట్‌ను లైంగికంగా వేధించాడు.
By Medi Samrat
30 ఏళ్ల జిమ్ ట్రైనర్ టాలీవుడ్ జూనియర్ ఆర్టిస్ట్‌ను లైంగికంగా వేధించాడు. పెళ్లి చేసుకుంటాననే నెపంతో మోసం చేసినందుకు బాధిత యువతి పోలీసులను ఆశ్రయించింది. సదరు వ్యక్తి తన వైవాహిక స్థితిని దాచిపెట్టి జూనియర్ ఆర్టిస్ట్ ను మోసం చేశారు.
జూబ్లీహిల్స్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు తాను 2019 నుండి హైదరాబాద్‌లో ఒంటరిగా నివసిస్తున్నానని తెలిపింది. గాయత్రి హిల్స్‌లో జిమ్ ట్రైనర్‌ను కలిసింది. ఇద్దరి మధ్య స్నేహం మొదలైంది. ఏకాభిప్రాయంతో లివింగ్-ఇన్ సంబంధంగా మారింది. మొదట్లో గాయత్రి హిల్స్‌లో రెండు నెలలు నివసించి, 2021- 2022 మధ్య తొమ్మిది నెలలు మణికొండకు మారారు. వివాహం పేరుతో తనను లైంగికంగా దోపిడీ చేశాడని ఆమె ఆరోపించింది.
అతను పెద్దగా ఆసక్తి చూపడం లేదని గ్రహించిన బాధితురాలు తన స్వస్థలమైన ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి వెళ్లిపోయింది. నవంబర్ 2023లో, ఆమె హైదరాబాద్‌కు తిరిగి వచ్చి పీజీ లో నివసించడం ప్రారంభించింది. ఈ సంవత్సరం ఏప్రిల్‌లో, జిమ్ ట్రైనర్ ఆమెను సంప్రదించి పెళ్లి చేసుకుందామంటూ 15 లక్షలు అడిగాడు. అతన్ని నమ్మి, ఆమె డిజిటల్ చెల్లింపుల ద్వారా రూ. 7 లక్షలు బదిలీ చేసి, మరో రూ. 7 లక్షల నగదును అందజేసింది.
డబ్బు అందుకున్న తర్వాత, జిమ్ ట్రైనర్ ఆమెను కలవడం మానేశాడు. ఈ సమయంలోనే అతను అప్పటికే వివాహం చేసుకున్నాడని ఆమెకు తెలిసింది. దీంతో జిమ్ ట్రైనర్ పై జూబ్లీ హిల్స్ పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) లోని పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.