ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో తుపాకీ కాల్పుల కలకలం రేగింది. ఓ గ్రామ సర్పంచ్‌పై మంగళవారం అర్థరాత్రి దుండగులు కాల్పులు జరిపారు. వివరాల్లోకి వెళ్తే.. గార మండలం రామచంద్రపురం సర్పంచ్ వెంకటరణ మూర్తి కార్యాలయం మరురానగర్‌లో ఉంది. ఆదివారం రాత్రి ఆదివారంపేటకు చెందిన ఓ మహిళ అక్కడికి వెళ్లింది. మహిళ తనతో పాటు ఇద్దరు వ్యక్తులను కూడా వెంట తీసుకెళ్లింది. ఇద్దరు సంభాషించుకుంటుండగానే.. మహిళతో వచ్చిన వ్యక్తులు సర్పంచ్‌పై కాల్పులు జరిపారు.
అనంతరంర అక్కడి నుండి నిందితులు పరరాయ్యారు. అయితే తుపాకీ తుటాలు వెంకటరమణ పొట్టను రాసుకుంటూ వెళ్లాయి. దీంతో ప్రమాదం తప్పినట్లైంది. సర్పంచ్‌కు గాయాలు కావడంతో హాస్పిటల్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులకు.. రెండు తుపాకీ బుల్లెట్లు లభించాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డీఎస్పీ ఆధ్వర్యంలో క్లూస్ టీం వేలిముద్రలు సేకరించారు. తదుపరి విచారణ సాగుతోంది.