జూన్ 30న కర్ణాటకలోని ఆలూర్ గ్రామంలో కుశాల్ అనే 19 ఏళ్ల యువకుడిని కొంతమంది యువకులు నగ్నంగా ఊరేగించి, దారుణంగా కొట్టారని ఆరోపణలు ఉన్నాయి. అతడు ఓ అమ్మాయికి మొబైల్ ఫోన్‌లో అసభ్యకరమైన సందేశం పంపాడని ఆరోపించారు. ఈ ఘటన ఆ అమ్మాయి సమక్షంలోనే జరిగింది. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో వీడియో క్లిప్పింగ్ వైరల్ గా మారింది.
కుశాల్ తో ఆ అమ్మాయికి గతంలో పరిచయం ఉందని తెలుస్తోంది. అయితే ఇటీవల వారిద్దరి మధ్య బ్రేకప్ జరిగింది. ఇక కుశాల్ పంపిన అసభ్యకరమైన సందేశాలను తన కొత్త ప్రియుడికి చూపించినట్లు తెలుస్తోంది. ఆమె కొత్త ప్రియుడు తన స్నేహితులను కుశాల్‌ను కలవమని కోరాడు. కుశాల్ రాగానే ఆ బృందం అతన్ని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి, నగ్నంగా పరిగెత్తించి, కర్రలతో దారుణంగా కొట్టారు.