మద్యం తక్కువైందని పెండ్లికొడుకును చంపిన స్నేహితులు

Groom stabbed to death for not providing more liquor to friends. పెళ్లి చేసుకున్న ఆనందంలో స్నేహితుల‌కు దావ‌త్ ఇచ్చాడు

By Medi Samrat  Published on  17 Dec 2020 4:23 AM GMT
మద్యం తక్కువైందని పెండ్లికొడుకును చంపిన స్నేహితులు

పెళ్లి చేసుకున్న ఆనందంలో స్నేహితుల‌కు దావ‌త్ ఇచ్చాడు పెళ్లికొడుకు. ఆ పార్టీలో మ‌ద్యం త‌క్కువైంద‌ని.. మ‌రింత తెప్పించాల‌ని పెళ్లికొడుకును కోరారు కొంద‌రు స్నేహితులు. అయితే.. అప్ప‌టికే వారికి మ‌ద్యం మ‌త్తు త‌ల‌కెక్కింద‌ని.. ఇంకా తాగితే ఇబ్బందులు ప‌డుతార‌ని భావించిన పెళ్లికొడుకు వ‌ద్దని స్నేహితుల‌ను వారించాడు. అది కాస్త చిలికి చిలికి గాలి వాన‌లా మారింది. దీంతో ఆవేశంతో స్నేహితులు.. పెళ్లికొడుకును దారుణంగా హ‌త్య‌చేశారు. ఈ విషాద ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగింది.

వివ‌రాల్లోకి వెళితే.. అలీఘ‌ర్ గ్రామానికి చెందిన బ‌బ్లూ(28) అనే యువ‌కుడికి వివాహాం జ‌రిగింది. పెండ్లి తర్వాత గ్రామంలోని స్నేహితులను కలిసేందుకు వెళ్లగా.. వారు మద్యం ఇప్పించాలని కోరారు. అప్ప‌టికే స్నేహితులంతా ఫూటుగా మద్యం సేవించి ఉండటంతో.. ఇంకా మద్యం తాగితే వారు ఇబ్బందిపడతారని భావించిన బ‌బ్లూ.. మ‌ద్యం ఇప్పించేందుకు నిరాక‌రించాడు. అదికాస్తా చిలికి చిలికి గాలివాన‌లా మారింది. మ‌ద్యం మ‌త్తులో ఉన్న వారు అక్క‌డే ఉన్న సీసాతో బ‌బ్లూను పొడిచేశారు. గ‌మ‌నించిన స్థానికులు అత‌డిని ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా.. తీవ్ర ర‌క్త‌స్రావం కావ‌డంతో చ‌నిపోయిన‌ట్లు వైద్యులు తెలిపారు.

స‌మాచారం అందుకున్న పోలీసులు అక్క‌డ‌కు చేరుకుని.. ఘర్షణకు దారితీసేందుకు కారకుడైన రామ్‌ఖిలాడీని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఐదుగురు నిందితుల కోసం గాలింపు మొదలెట్టారు. ఇలా.. పెళ్లి అయిన గంటల వ్యవధిలోనే పెళ్లి కొడుకు చనిపోవడం ఇరు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.
Next Story