17 ఏళ్ల విద్యార్థినిపై మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడో ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్. దీంతో ఆ ప్రిన్సిపాల్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రిన్సిపాల్ నవంబర్ 23న పాఠశాలలోని తొమ్మిది మంది విద్యార్థులను బృందావన్‌కు టూర్‌కు తీసుకెళ్లి, బాలికల వసతి కోసం ఒక హోటల్‌లో రెండు గదులు తీసుకున్నాడు. ఒక గదిలో ఎనిమిది మంది విద్యార్థులు ఉంచగా, మరో గదిలో 11వ తరగతి చదువుతున్న 17 ఏళ్ల బాలికతో పాటు ప్రిన్సిపాల్ ఉన్నారు.
ప్రిన్సిపాల్ విద్యార్థిని ఆహారంలో మత్తు పదార్థాన్ని కలిపి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విద్యార్థిని ప్రతిఘటించడంతో పరీక్షల్లో ఫెయిల్ చేసి చంపేస్తానని బెదిరించాడని హస్తినాపూర్ పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ బచు సింగ్ తెలిపారు. విద్యార్థులు నవంబర్ 24న వారి ఇళ్లకు తిరిగి వచ్చారు. మొదట్లో బాలిక ఈ సంఘటన గురించి మౌనంగా ఉండిపోయింది. అయితే తరువాత జరిగిన సంఘటనల క్రమాన్ని తన కుటుంబ సభ్యులకు వివరించింది అని అతను చెప్పాడు.
బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు శనివారం ప్రిన్సిపాల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌ఓ తెలిపారు. పరారీలో ఉన్న ప్రిన్సిపాల్‌ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.