అనుమానాస్పద స్థితిలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మృతి

Government Teacher Died In Suspicious Condition. ఆదిలాబాద్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం పట్టణంలో

By Medi Samrat  Published on  17 Dec 2022 9:00 PM IST
అనుమానాస్పద స్థితిలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మృతి

ఆదిలాబాద్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం పట్టణంలో కలకలం రేపింది. పట్టణంలోని సంజయ్‌నగర్‌ కాలనీలో నివాసం ఉంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కరుణ శనివారం తెల్లవారుజామున భవనంపై నుంచి పడి తీవ్ర గాయాలపాలైంది. తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అయితే ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. మృతురాలు జైనథ్ మండలం పెండల్వాడ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నట్లు సమాచారం. టూ టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.


Next Story