మంచంపై బాలిక నగ్న మృతదేహం.. భార్య బంధువుల ఇంటికి వెళ్లిన తర్వాత

Girl's body found in Delhi, accused in absconding. శుక్రవారం రాత్రి ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో గొంతు కోసి హత్య చేసిన బాలిక నగ్న మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు

By అంజి  Published on  19 Feb 2022 12:05 PM IST
మంచంపై బాలిక నగ్న మృతదేహం.. భార్య బంధువుల ఇంటికి వెళ్లిన తర్వాత

శుక్రవారం రాత్రి ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో గొంతు కోసి హత్య చేసిన బాలిక నగ్న మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. బురారీ ప్రాంతంలోని కౌశిక్ ఎన్‌క్లేవ్‌లో జరిగిన ఈ నేరానికి పాల్పడిన తర్వాత అమన్ అనే నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తన భార్య తన బంధువును కలిసేందుకు ఇంటి నుంచి వెళ్లిన తర్వాత నిందితుడు బాలికను ఇంటికి ఆహ్వానించాడు. ఇంటికి తిరిగి వచ్చిన భార్య మంచంపై పడి ఉన్న బాలిక మృతదేహాన్ని గుర్తించింది. ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన బురారీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ప్రాథమిక విచారణ ప్రకారం.. అమన్ తన భార్య ప్రియాంక రావత్‌తో కలిసి కౌశిక్ ఎన్‌క్లేవ్‌లోని ఒక ఫ్లాట్‌లో నివసిస్తున్నాడు. "అతని భార్య బంధువుల ఇంటికి వెళ్లి రాత్రి 8 గంటలకు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు.. ఆమె మంచంపై పాక్షిక నగ్న స్థితిలో బాలిక మృతదేహాన్ని గుర్తించింది. ప్రియాంక వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత వారు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు." అని ఒక అధికారి చెప్పారు.

మృతురాలు నాథుపురా ప్రాంతానికి చెందినదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మృతురాలి తండ్రికి సమాచారం అందించారు. అమన్‌ను పట్టుకునేందుకు, హత్య వెనుక ఖచ్చితమైన ఉద్దేశ్యాన్ని తెలుసుకోవడానికి పోలీసులు గాలింపు చేపట్టారు. "చనిపోయిన అమ్మాయితో అమన్‌కు చాలా కాలంగా సంబంధం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అయితే ఏ పరిస్థితుల్లో హత్య జరిగింది. దాని వెనుక కారణం ఏమిటి, పోలీసులు అమన్ కోసం తీవ్రంగా వెతుకుతున్నారు" అని అధికారి తెలిపారు.

Next Story