వరుడిపై యాసిడ్‌ పోసిన గర్ల్‌ఫ్రెండ్‌

ఉత్తరప్రదేశ్‌లోని బలియాలో వరుడిపై అతని గర్ల్‌ఫ్రెండ్‌ యాసిడ్‌ పోసింది. ఏప్రిల్ 23, మంగళవారం బన్స్‌డిహ్‌లోని డుమ్రీలో ఈ ఘటన జరిగింది.

By అంజి  Published on  24 April 2024 3:27 PM IST
Acid attack, Wedding, Ballia, Uttar Pradesh, Crime news

వరుడిపై యాసిడ్‌ పోసిన గర్ల్‌ఫ్రెండ్‌

ఉత్తరప్రదేశ్‌లోని బలియాలో వరుడిపై అతని గర్ల్‌ఫ్రెండ్‌ యాసిడ్‌ పోసింది. ఏప్రిల్ 23, మంగళవారం బన్స్‌డిహ్‌లోని డుమ్రీలో ఈ ఘటన జరిగింది. పెళ్లి ఊరేగింపులో తన ప్రియుడు అయిన వరుడిపై అమ్మాయి యాసిడ్ దాడి చేసింది. బాధితుడి తల్లి ఫిర్యాదు మేరకు భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 326బి (ఎవరైనా స్వచ్ఛందంగా వివిధ ప్రమాదకర సాధనాలు లేదా సాధనాలను ఉపయోగించి తీవ్రమైన గాయాలు చేయడం) కింద కేసు నమోదు చేసినట్లు పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ మున్నా లాల్ యాదవ్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యువకుడు తన పెళ్లి ఊరేగింపును వదిలి వెళుతుండగా.. వరుడిపై అమ్మాయి యాసిడ్ పోసింది.

దీంతో కుటుంబ సభ్యులు వరుడిని జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. వరుడి ఇంట్లోని కొందరు మహిళా సభ్యులు అమ్మాయిని కొట్టి పోలీసులకు అప్పగించారు. ''వీరు కొంతకాలంగా రిలేషన్‌లో ఉన్నారు. ఇది ఇష్టపడని వరుడి కుటుంబ సభ్యులు ఉద్యోగ నెపంతో అతడిని బయట ప్రాంతానికి పంపి మరొకరితో పెళ్లి ఖరారు చేశారు. కాగా వరుడు బారాత్‌లో పాల్గొన్న టైమ్‌లో ఈ ఘటన జరిగింది. అదృష్టవశాత్తు పెద్దగా గాయపడలేదు'' అని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని, లీగల్ నోటీసుల మేరకు చర్యలు తీసుకుంటామని పోలీస్ స్టేషన్ హెడ్ అఖిలేష్ చంద్ర పాండే తెలిపారు.

Next Story