టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న యువతిపై సామూహిక అత్యాచారం

Girl traveling without ticket, gang raped by railway employees. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న యువతిపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన

By Medi Samrat  Published on  1 Jun 2022 8:15 PM IST
టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న యువతిపై సామూహిక అత్యాచారం

టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న యువతిపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హృదయ విదారకమైన ఈ ఘటన పాకిస్థాన్‌లో చోటుచేసుకుంది. మే 27న కరాచీ నుంచి ముల్తాన్‌కు ఒంటరిగా వెళ్తున్న 25 ఏళ్ల యువతిని అడ్డగించి అత్యాచారం చేశారు.

సోమవారం బాధితురాలు పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చిందని పాక్ మీడియా పేర్కొంది. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని వారి నమూనాలను డీఎన్‌ఏ పరీక్షకు పంపారు. ముల్తాన్-కరాచీ మధ్య నడుస్తున్న బహువుద్దీన్ జకారియా ఎక్స్‌ప్రెస్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది.

ఈ కేసులో అరెస్టయిన ముగ్గురిలో ఇద్దరు టికెట్ కలెక్టర్స్ కాగా.. మూడవ వ్యక్తి ఇన్‌ఛార్జ్ అని తెలుస్తోంది. నిందితులు తనపై అత్యాచారం చేస్తున్న వీడియోను కూడా తీశారని బాధితురాలు ఆరోపించింది. ముగ్గురి మొబైల్ ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రైల్వే మేనేజ్‌మెంట్, పాకిస్తాన్ ప్రభుత్వం ఈ ఘటనను అణిచివేసేందుకు ప్రయత్నించాయని పాక్ మీడియా చెబుతోంది. అయితే సోషల్ మీడియాలో జనాల ఆగ్రహాన్ని చూసి చర్యలు తీసుకోడానికి పాక్ ప్రభుత్వం ముందుకు వచ్చింది.









Next Story