Hyderabad: బాలికపై మైనర్లు అత్యాచారం.. కత్తితో బెదిరించి..

హైదరాబాద్‌ నగరంలోని బోరబండలో అమానుష సంఘటన వెలుగులోకి వచ్చింది. బాలికపై ఇద్దరు మైనర్లు గత కొన్ని రోజులుగా అత్యాచారానికి పాల్పడుతూ వచ్చారు.

By అంజి  Published on  1 Oct 2023 9:30 AM IST
telangana, Borabanda, hyderabad, Crime news

Hyderabad: బాలికపై మైనర్లు అత్యాచారం.. కత్తితో బెదిరించి..

ఆడపిల్లలకు తల్లి గర్భంలో తప్ప మరెక్కడ రక్షణ లేకుండా పోయింది. కామాంధులు చిన్నపిల్లలను సైతం తమ కామ దాహానికి బలి చేసి వారి భవిష్యత్తును అంధకారం చేస్తున్నారు. ఇటువంటి కామాంధులకు చట్టం ఎన్ని శిక్షలు వేస్తున్నా కూడా ఆడపిల్లలపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా హైదరాబాద్‌ నగరంలోని బోరబండలో అమానుష సంఘటన వెలుగులోకి వచ్చింది. బాలికపై ఇద్దరు మైనర్లు గత కొన్ని రోజులుగా అత్యాచారానికి పాల్పడుతూ వచ్చారు. బోరబండ పరిసర ప్రాంతాల్లో నివాసముంటున్న 14 సంవత్సరాల వయసుగల ఒక మైనర్ బాలిక స్థానిక పాఠశాలలో ఏడవ తరగతి చదువుతోంది.

ఓ ఇద్దరు మైనర్లు కామంతో కొట్టుమిట్టాడుతూ మైనర్ బాలికపై కన్ను వేశారు. మైనర్లు బాలికను కత్తితో చంపుతామని బెదిరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ సమయంలో వీడియోలు తీసి వాటిని చూపించి గత కొన్ని రోజులుగా అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేస్తూ ఆమెపై లైంగిక దాడికి పాల్పడుతున్నారు. ఇద్దరు మైనర్ల ఆగడాలు తట్టుకోలేక బాలిక విషయం మొత్తం తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో బాలిక తల్లిదండ్రులు వెంటనే బోరబండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితులపై పొక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల గాలింపు చర్యలు చేపట్టారు. బాధితురాలికి కౌన్సెలింగ్, వైద్య పరీక్షల నిమిత్తం భరోసా కేంద్రానికి పంపించారు.

Next Story