షాకైన బెంగళూరు.. యువతి దారుణ హత్య

Girl student stabbed to death at Bengaluru Presidency College. బెంగళూరులో సోమవారం నాడు దారుణం చోటు చేసుకుంది.

By M.S.R  Published on  2 Jan 2023 6:33 PM IST
షాకైన బెంగళూరు.. యువతి దారుణ హత్య

బెంగళూరులో సోమవారం నాడు దారుణం చోటు చేసుకుంది. ప్రెసిడెన్సీ కాలేజీలో 19 ఏళ్ల యువతిని కత్తులతో పొడిచి చంపారు. ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. దాడి తర్వాత ప్రాణాపాయ స్థితిలో ఉన్న దుండగుడిని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన బాలికను అంబులెన్స్‌లో తరలిస్తున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి

బాధితురాలు లయస్మిత బెంగళూరు రూరల్‌లోని కళాశాల విద్యార్థిని కాగా, దాడికి పాల్పడిన యువకుడి పేరు పవన్ కళ్యాణ్. నిందితుడు మరో విద్యాసంస్థకు చెందిన విద్యార్థి. లయస్మితకు హాని చేయాలనే ఉద్దేశంతో ప్రెసిడెన్సీ కాలేజీకి వచ్చాడు. హత్య జరిగిన వెంటనే, నిందితుడు కూడా ఆత్మహత్య చేసుకోడానికి ప్రయత్నించాడు. తన జీవితాన్ని అంతం చేసుకోవాలనే ఉద్దేశంతో అదే ఆయుధంతో తనను తాను పొడుచుకున్నాడు. లవ్ చేస్తున్నానని పవన్ కళ్యాణ్ అమ్మాయి వెంట తిరుగుతూ వచ్చాడు..అతడిని తిరస్కరించినందుకు ఆ అమ్మాయిపై పవన్ కళ్యాణ్ పగ పెంచుకున్నాడు. ఆమె మరో అబ్బాయితో ప్రేమలో ఉన్నట్టు సమాచారం. అయితే హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

Next Story