మైనర్ బాలికను గర్భవతిని చేసిన బాలుడు.. ఈ ఘటన జరిగింది ఇక్కడే..
Girl sexually abused Minor Boy In Hyderabad. మైనర్ బాలుడు, మైనర్ బాలికపై అత్యాచారం చేయటంతో.. బాలిక గర్భం దాల్చింది.
By Medi Samrat Published on 25 Oct 2021 12:03 PM GMT
మైనర్ బాలుడు, మైనర్ బాలికపై అత్యాచారం చేయటంతో.. బాలిక గర్భం దాల్చింది. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. సైదాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో ఐ.ఎస్.సదన్ డివిజన్‌లోని ఓ బస్తీలో 15 ఏళ్ల బాలిక తల్లిదండ్రులతో కలిసి నివసిస్తూ ఉంది. ఇంటి ఎదురుగా ఉన్న కుటుంబంలో 16 ఏళ్ల బాలుడు కూడా తన కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నారు. కూలీ చేసుకుని రెండు కుటుంబాలు జీవిస్తున్నాయి. ఇంట్లోని పెద్దవారు ఉదయాన్నే కూలీ పనులకు వెళ్లేవారు. ఇంట్లో పిల్లలు ఉండేవాళ్లు. పెద్దవారు ఎవరూ లేకపోవటంతో 16 ఏళ్ల బాలుడు వారి ఇంటి ఎదురుగా ఉన్న ఇంట్లోని 15 ఏళ్ళ బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఈ విషయాన్ని బాలుడు, బాలిక గుట్టుగా ఉంచారు. శుక్రవారం, అక్టోబర్ 22వ తేదీన బాలికకు విపరీతమైన కడుపునొప్పి రావటంతో బాలికను ఆస్పత్రికి తీసుకు వెళ్ళారు. డాక్టర్లకు అనుమానం వచ్చి పరీక్షలు చేయగా బాలిక ఐదు నెలల గర్భవతి అని తేలింది. బాలిక ద్వారా విషయం తెలుసుకున్న తల్లి తండ్రులు సైదాబాద్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడైన బాలుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడిని బాలుర సంరక్షణా కేంద్రానికి తరలించారు.