రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మైనర్ బాలికను ఓ బాలుడు వేధింపులకు గురి చేసిన సంఘటన చోటుచేసుకుంది. ఈ కేసు బయానా పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ హయ్యర్ సెకండరీ ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినది. అక్కడ 11వ తరగతి చదువుతున్న ఒక బాలిక తన తరగతిలో చదువుతున్న అబ్బాయిపై వేధింపులకు పాల్పడుతున్నాడని కేసు పెట్టింది. రిపోర్టు ప్రకారం.. మైనర్ బాలిక తాను పాఠశాలలో ఉండగా, 11వ తరగతి బాలుడు తరగతి లోపల తనను పట్టుకుని అసభ్యకర చర్యలు ప్రారంభించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అమ్మాయి వ్యతిరేకించినా అబ్బాయి ఆగలేదు. ఆ బాలిక ఎలాగోలా బాలుడి బారి నుంచి విముక్తి పొంది ఇంటికి వెళ్లి విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది.
అనంతరం బాధితురాలు తన కుటుంబ సభ్యులతో కలిసి బయానా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని బాలుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలికపై వేధింపులకు పాల్పడినట్లు ఓ బాలుడిపై ఫిర్యాదు చేసినట్లు బయానా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ పురాన్ చంద్ తెలిపారు. ఈ ఘటనపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల బీహార్‌లోని జముయ్‌లో ట్యూషన్ టీచర్ మైనర్ బాలికలను వేధింపులకు గురిచేసి అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపణలు వచ్చాయి. పిల్లలంతా పక్క ఊరి నుంచి చదువుకునేందుకు వస్తుండే వారని స్థానికులు చెబుతున్నారు. ఈ దారుణ ఘటనపై ఓ బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు అనేక చోట్ల గాలింపు చర్యలు చేపట్టారు.