డ్రైవర్ లైంగిక వేధింపులు.. వేగంగా వెళ్తున్న ఆటోలో నుంచి దూకిన బాలిక.. వీడియో
Girl jumps off speeding autorickshaw after driver tries to molest her in Aurangabad. ఓ మైనర్ బాలిక, ట్యూషన్ ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్లేందుకు ఆటో ఎక్కింది. అయితే ఆటో ఎక్కిన తర్వాత
By అంజి Published on 16 Nov 2022 1:06 PM ISTఓ మైనర్ బాలిక, ట్యూషన్ ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్లేందుకు ఆటో ఎక్కింది. అయితే ఆటో ఎక్కిన తర్వాత డ్రైవర్ లైంగిక వేధింపులకు ప్రయత్నించడంతో బాలిక కదులుతున్న ఆటోరిక్షాలో నుంచి బయటకు దూకింది. ఈ ఘటన సమీపంలోని సీసీటీవీలో రికార్డైంది. ఈ ఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో జరిగింది. ఆటో డ్రైవర్ తనను వేధించాడంటూ బాలిక చెప్పింది. మైనర్ బాలిక తనపై జరగబోతున్న అఘాయిత్యం నుంచి తప్పించుకునే ప్రయత్నంలో కదులుతున్న వాహనం నుండి త్వరితగతిన కిందకు దూకిందని స్థానికులు తెలిపారు.
రద్దీగా ఉండే ప్రధాన రహదారిపై దూకడంతో బాలిక గాయపడింది. నిందితుడు ఆటో డ్రైవర్‌ను సయ్యద్ అక్బర్ హమీద్‌గా గుర్తించి అరెస్టు చేశారు. డ్రైవర్ అసభ్యకర మాటలు మాట్లాడుతూ, వెకిలి చేష్టలు చేయడాన్ని పసిగట్టడంతో బాలిక వేగంగా వెళ్తున్న వాహనంపై నుంచి దూకినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆమె తలకు గాయం కావడంతో ఎంజీఎం ఆసుపత్రిలో చేర్చారు. బాలిక ఆటోలో నుంచి దూకిన దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
బాలిక ఒక్కసారిగా కిందపడటంతో సహాయం చేయడానికి చాలా మంది పరుగున వచ్చారు. ఒక వ్యక్తి వాటర్ బాటిల్ తీసుకుని ఆమె వద్దకు వెళ్లాడు. వాస్తవానికి రోడ్డుపై పడి ఉన్న బాలికకు సాయం చేసేందుకు ఇతర వాహనాలు నిలిచిపోయాయి. కొన్ని నిమిషాల పాటు కదలకుండా, ఆ అమ్మాయి కాళ్లు వణుకుతున్న దృశ్యం, ఆ తర్వాత వీడియోలో కనిపించింది. యాక్సెస్ చేసిన విజువల్స్‌లో, అమ్మాయి కొన్ని నిమిషాల పాటు కదలలేదు, బహుశా అపస్మారక స్థితిలో ఉంది. ఈ ఘటనపై బాలలపై లైంగిక నేరాల నుంచి రక్షణ చట్టం (పోక్సో) కింద కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టి అరెస్ట్ చేశారు.
నవంబర్ 13వ తేదీన ట్యూషన్ ముగించుకుని ఆటోలో ఇంటికి వస్తున్న బాలికపై ఆటోరిక్షాలో వేధింపులకు గురైంది. ఈ ఘటన సంబంధించిన కేసు ఔరంగాబాద్ క్రాంతి చౌక్ పోలీస్ స్టేషన్‌లో నమోదైంది. పోలీసు ఇన్‌స్పెక్టర్ గణపత్ దారాడే మాట్లాడుతూ.. ''మైనర్ విద్యార్థిని ఉస్మాన్‌పురా ప్రాంతం నుండి ఆటోరిక్షాలో తన ఇంటికి వెళుతుండగా, డ్రైవర్ అసభ్యంగా మాట్లాడి బాలికను వేధింపులకు గురి చేశాడు. అదే సమయంలో ఔరంగాబాద్‌లోని సిల్లి ఖానా కాంప్లెక్స్ కదులుతున్న ఆటోలో నుంచి దూకడంతో బాలిక తలకు గాయమై ఆసుపత్రిలో చేరింది.'' అని చెప్పారు.