ఉత్తరప్రదేశ్‌లోని కాస్‌గంజ్‌లో ఒక టీనేజీ బాలికపై ఎనిమిది మంది వ్యక్తులు ఆమె కాబోయే భర్తను బందీగా ఉంచి సామూహిక అత్యాచారం చేశారు. నిందితులందరినీ అరెస్టు చేసినట్లు పోలీసులు ఆదివారం నాడు తెలిపారు. ఏప్రిల్ 10వ తేదీ మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో ఆ జంట రోడ్డు పక్కన కాలువ దగ్గర కూర్చుని ఉండగా ఈ సంఘటన జరిగింది. వారు ఒంటరిగా ఉండటం చూసి, దుండగుల బృందం దగ్గరకు వచ్చి ఆ వ్యక్తిని బందీగా ఉంచి, అతని కాబోయే భార్యపై సామూహిక అత్యాచారం చేశారని పోలీసులు తెలిపారు.
ఆ తర్వాత ఆ దుండగులు ఆ వ్యక్తి నుండి డబ్బును కూడా దోచుకున్నారు. ఫిర్యాదు ప్రకారం.. బాధితురాలు తనను చాలా మంది వ్యక్తులు ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి "ఒక్కొక్కరుగా" తనపై "అత్యాచారం" చేశారని పేర్కొంది. నిందితుడిని ఈరోజు కోర్టు ముందు హాజరుపరుస్తారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు. త్వరిత న్యాయం కోసం పోలీసులు ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించాలని యోచిస్తున్నారు. తదుపరి దర్యాప్తు జరుగుతోంది.