అమ్మాయిని ఫాలో అవుతూ వెళ్లాడు.. చెప్పు దెబ్బలు తిన్నాడు

Girl beats 35-year-old man with slippers for harassing her in Karnataka’s Udupi. శుక్రవారం కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో కాలేజీ విద్యార్థినిని వేధించాడనే ఆరోపణలతో ఒక వ్యక్తిని చెప్పులతో కొట్టారు

By Medi Samrat
Published on : 10 Jun 2023 1:00 PM IST

అమ్మాయిని ఫాలో అవుతూ వెళ్లాడు.. చెప్పు దెబ్బలు తిన్నాడు

శుక్రవారం కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో కాలేజీ విద్యార్థినిని వేధించాడనే ఆరోపణలతో ఒక వ్యక్తిని చెప్పులతో కొట్టారు. స్థానికులంతా కలిసి ఆ వ్యక్తిని పట్టుకుని చెప్పులతో కొట్టారు. అమ్మాయి ఆ వ్యక్తి తలపై, ముఖంపై తన చెప్పులతో కొట్టడంతో తనను విడిచిపెట్టమని అభ్యర్థిస్తున్న వీడియో వైరల్ అవుతూ ఉంది. గ్రామస్తులు చూస్తుండగా అతడు దెబ్బలు తింటూనే ఉన్నాడు. శుక్రవారం ఉదయం హాస్టల్ నుంచి కాలేజీకి వెళ్తున్న బాలికను ఆ వ్యక్తి వెంబడించి వేధించాడని స్థానికులు చెబుతున్నారు. కళాశాల విద్యార్థి స్థానికులను అప్రమత్తం చేయడంతో అతడిని పట్టేసుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.

బాలిక తన హాస్టల్ నుండి కాలేజీకి ఒక్వాడి రోడ్డులో నడుచుకుంటూ వెళ్తుండగా, 35 ఏళ్ల నజీర్ ఆమె వద్దకు వచ్చి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో భయపడిన బాలిక సహాయం కోసం కేకలు వేసింది. వెంటనే స్థానికులను అప్రమత్తం చేయడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అతడిని పట్టుకుని సరైన బుద్ధి చెప్పారు.


Next Story