ఒడిశాలోని పూరీలోని నీమపాడ బ్లాక్‌లోని బలండా పోలీస్ స్టేషన్ పరిధిలో 15 ఏళ్ల బాలికను అగంతకులు తగలబెట్టి చంపడానికి ప్రయత్నించారు. దాడిలో తీవ్రంగా కాలిన గాయాలైన మైనర్ బాలికను చికిత్స నిమిత్తం భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌కు తరలించారు.
పూరి జిల్లా మేజిస్ట్రేట్ చంచల్ రాణా ANIతో మాట్లాడుతూ.. “నిమాపాడా బ్లాక్‌లోని బాలండా పోలీస్ స్టేషన్‌లో 16 ఏళ్ల బాలికకు నిప్పంటించిన దురదృష్టకర సంఘటన గురించి మాకు సమాచారం అందింది. ఆమెకు బాగా కాలిన గాయాలయ్యాయి. మేము బాలికను AIIMSకి తరలించాం. అత్యవసర సంరక్షణకై ఏర్పాట్లు చేయబడ్డాయి. చికిత్స కోసం ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తుందని చంచల్ రాణా హామీ ఇచ్చారు. నిందితులపై పోలీసులు అవసరమైన చర్యలు తీసుకుంటారని ఆయన చెప్పారు.
ఒడిశా ఉపముఖ్యమంత్రి ప్రవతి పరిదా ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. “బలంగా ప్రాంతంలో రోడ్డుపై కొందరు దుండగులు పదిహేనేళ్ల బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించారనే వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యాను, వెంటనే ఆమెను భువనేశ్వర్‌లోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుంది. నిందితుడిని వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు.