భార్యను చంపి శవంతో సెల్ఫీ.. బంధువులకు పంపాడు

ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసి.. ఆమె శవంతో సెల్ఫీ దిగాడు.. ఇక చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది.

By అంజి  Published on  18 May 2024 8:45 AM IST
Ghaziabad, Uttar Pradesh, Crime news

భార్యను చంపి శవంతో సెల్ఫీ.. బంధువులకు పంపాడు 

ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసి.. ఆమె శవంతో సెల్ఫీ దిగాడు.. ఇక చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. ఈటాహ్‌కు చెందిన దంపతులు ఘజియాబాద్‌లో నివాసం ఉంటున్నారు. భర్త లోనీలో పనిచేస్తుండగా, భార్య నోయిడాలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. భార్య ఉద్యోగానికి వెళ్లడం భర్తకు ఏ మాత్రం ఇష్టం లేదు. దీంతో ఇద్దరి మధ్య అనేకసార్లు గొడవలు కూడా జరిగినట్లు సమాచారం.

స్కార్ఫ్ తో భార్య గొంతు బిగించి హత్య చేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని ఒడిలో పెట్టుకుని సెల్ఫీ దిగి బంధువులకు పంపించాడు. వెంటనే ఆ వ్యక్తి తమ్ముడు అతనిని సంప్రదించడానికి ప్రయత్నించాడు. కానీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇక వారి ఇంటికి చేరుకోగా.. అప్పటికే వదిన నిర్జీవంగా పడి ఉండడం చూశాడు. తన అన్న ఉరి వేసుకుని చనిపోయినట్లు కనుగొన్నాడు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (దేహత్) వివేక్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. “భర్త మొదట తన భార్యను గొంతు బిగించి చంపేశాడు, ఆపై అదే స్కార్ఫ్‌తో ఉరి వేసుకున్నట్లు తెలుస్తోంది. ఆత్మహత్య చేసుకునే ముందు, చనిపోయిన తన భార్యతో సెల్ఫీ తీసుకుని తన 5-6 మంది బంధువులకు పంపించాడు." అని తెలిపారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

Next Story