షాద్‌నగర్‌లో భారీ పేలుడు.. ఆరుగురు మృతి

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని గాజుల ఫ్యాక్టరీలో శుక్రవారం జరిగిన పేలుడులో ఆరుగురు మృతి చెందగా, 15 మంది కార్మికులు గాయపడ్డారు.

By Medi Samrat  Published on  28 Jun 2024 7:42 PM IST
షాద్‌నగర్‌లో భారీ పేలుడు.. ఆరుగురు మృతి

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని గాజుల ఫ్యాక్టరీలో శుక్రవారం జరిగిన పేలుడులో ఆరుగురు మృతి చెందగా, 15 మంది కార్మికులు గాయపడ్డారు. ఎప్పటిలాగే కార్మికులు పని చేస్తూ ఉండగా భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి పలువురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆరుగురు వ్యక్తులు చనిపోయారని చెబుతున్నారు.. దీనికి సంబంధించి అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది. పేలుడు సంభవించిన వెంటనే అంబులెన్స్‌లు అక్కడికి చేరుకున్నాయి. పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతి చెందినవారిలో ఒడిశా, బీహార్, ఉత్తరప్రదేశ్ వాసులు ఉన్నారు.

సౌత్ గ్లాస్ ప్రైవేటు కంపెనీలో కంప్రెషర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. గాజు పరిశ్రమ కావడంతో కార్మికుల మృతదేహాలు ఛిద్రమయ్యాయి. సమాచారం అందగానే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. ఫైరింజన్లు మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి.

Next Story