నా తప్పు కూడా ఉంది.. సూసైడ్ నోట్‌లో ప్రియుడి గురించి సంచలన విషయాలు వెల్లడించిన గ్యాంగ్‌రేప్ బాధితురాలు
ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌లో మైనర్‌పై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన వెలుగు చూసింది.
By Medi Samrat Published on 20 Feb 2025 3:27 PM IST
ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌లో మైనర్‌పై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన వెలుగు చూసింది. భిలాయ్‌లోని స్మృతి నగర్ చౌకీ ప్రాంతంలో సామూహిక అత్యాచారానికి గురైన మైనర్ ఆ తర్వాత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. పలువురు బంధువులు పోలీసు పోస్టును చుట్టుముట్టి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్యాంగ్ రేప్ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత మైనర్ ఆత్మహత్య చేసుకుంది. చనిపోయే ముందు, మైనర్ తన మొబైల్‌లో సూసైడ్ నోట్, ఆధారాలను వదిలివెళ్లింది. ప్రస్తుతం నిందితుడు ప్రియుడు, అతని సహచరుడు పరారీలో ఉన్నారు.
స్మృతి నగర్ చౌకీ ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల మైనర్ ఫిబ్రవరి 18న తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మైనర్ సూసైడ్ నోట్‌లో.. తన ప్రియుడు, అతని సహచరులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించారు. సూసైడ్ నోట్‌లో, ఆమె తన మొబైల్‌లో కొంత చాటింగ్ గురించి ప్రస్తావించింది, ఇది సామూహిక అత్యాచారం కేసును రుజువు చేస్తుంది.
తన లేఖ చివరన మొబైల్ ప్యాటర్న్ లాక్ చిహ్నాన్ని కూడా గీసింది. బుధవారం మృతురాలి బంధువులు, సంఘ ప్రజలతో కలిసి పోలీసు పోస్టును చుట్టుముట్టి నిందితులను అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మైనర్ అదే ప్రాంతంలో నివసిస్తున్న ఆది బార్లేతో గత జూన్ నుంచి ప్రేమ వ్యవహారం నడుపుతున్నట్లు ప్రాథమిక విచారణలో పోలీసులకు సమాచారం అందింది. ఇద్దరూ ఫోన్‌లో మాట్లాడుకోవడంతోపాటు వాట్సాప్‌లో కూడా మాట్లాడుకున్నారు. దీని తరువాత, ఆది ఆమెతో జీవితాంతం కలిసి ఉంటానని వాగ్దానం చేసి ఆమెను శారీరకంగా వాడుకోవడం ప్రారంభించాడు.
ఈ విషయం నిందితుడు ఆది తన స్నేహితులకు తెలియజేశాడు. అప్పుడు వారంతా కూడా బాధితురాలిపై సామూహిక అత్యాచారానికి ప్లాన్ చేశారు. దీంతో ఆది ఫిబ్రవరి 16న ఇంట్లో ఒంటరిగా ఉందని బాధితురాలిని తన గదికి పిలిచాడు. అతని స్నేహితులు కూడా అక్కడికి చేరుకున్నారు. అనంతరం అందరూ కలిసి బాధితురాలిపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక తన సోదరుడికి, తల్లికి అసలు విషయం చెప్పింది. ఆ తర్వాత ఫిబ్రవరి 18న మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది.
మైనర్ గదిలో లభించిన సూసైడ్ నోట్‌లో ఆమె తన ప్రియుడు ఆది బార్లే అని పేర్కొంది. సూసైడ్ నోట్‌లో ఇలా రాసి ఉంది.. “నేను ఏమి చేసినా, అది నా తప్పు అని నేను అంగీకరిస్తున్నాను, కానీ ప్రతిదీ ఆది, నా కోరిక ప్రకారమే జరిగింది, అంతే కాకుండా నేను ఇప్పటివరకు ఎవరితోనూ ఇలాంటివి చేయలేదు. ఇది మొదటిసారి కాదు. నేను అతని ఇంటికి వళ్లేదానిని.. అప్పటి నుంచి ఇదే అంతా.. జూన్ 2, 2024 నుండి ఇది అంతా జరుగుతోంది. కొన్నిసార్లు బలవంతంగా, కొన్నిసార్లు నా కోరిక ప్రకారం జరిగింది అని వెల్లడించింది.. బాలిక మొబైల్ ఫోన్ నుంచి వాట్సాప్ చాట్‌లు, కొన్ని కాల్ రికార్డింగ్‌లు లభ్యమయ్యాయి. దీంతో వీరిద్దరి మధ్య రిలేషన్ షిప్ కన్ఫర్మ్ అవుతోంది.