నిజామాబాద్ ఆస్పత్రి గదిలో గ్యాంగ్ రేప్

Gang Rape In Nizamabad. తెలంగాణలోని నిజామాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతికి మద్యం తాగించిన

By Medi Samrat  Published on  29 Sep 2021 6:47 AM GMT
నిజామాబాద్ ఆస్పత్రి గదిలో గ్యాంగ్ రేప్

తెలంగాణలోని నిజామాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతికి మద్యం తాగించిన నలుగురు యువకులు ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.

ఓ ప్రైవేటు ఆస్పత్రి గదిలో మంగళవారం అర్థరాత్రి ఈ దారుణం జరిగింది. ఇది గమనించిన సెక్యూరిటీ సిబ్బంది డయల్ 100కు ఫిర్యాదు చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు యువతి మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఓ ఆస్పత్రికి తరలించారు. ఘటనమీద కేసు నమోదు చేసిన వన్ టౌన్ పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.


Next Story
Share it