హైదరాబాద్‌లో ఒంటరిగా ఉన్న పిల్లలను కిడ్నాప్ చేసే ముఠా అరెస్ట్
హైదరాబాద్‌లో చిన్న పిల్లలను కిడ్నాప్ చేసే ముఠాను చందానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు
By Knakam Karthik
హైదరాబాద్‌లో ఒంటరిగా ఉన్న పిల్లలను కిడ్నాప్ చేసే ముఠా అరెస్ట్
హైదరాబాద్‌లో చిన్న పిల్లలను కిడ్నాప్ చేసే ముఠాను చందానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మాదాపూర్ డీసీపీ వినీత్ మీడియాకు వెల్లడించారు. హైదరాబాద్, సైబరాబాద్, సంగారెడ్డి జిల్లాలలో ఐదు సంవత్సరాల లోపు గల పిల్లలను కిడ్నాప్ చేసి పిల్లలు లేని తల్లిదండ్రులకు విక్రయిస్తూ..పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదిస్తున్నట్లు గుర్తించారు. గత కొన్ని సంవత్స రాలుగా నిర్మానుష్య ప్రాంతంలో ఒంటరిగా ఆడుకుంటున్న చిన్నారి పిల్లలను టార్గెట్‌గా చేసుకొని గుట్టు చప్పుడు కాకుండా వారినీ కిడ్నాప్ చేసి ఇతరులకు విక్రయిస్తున్నారు. లింగంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓ దంపతులు తమ నాలుగు సంవత్సరాల కుమారుడు అఖిల్ గత నెల ఆగస్టు 28వ తేదీన లింగంపల్లి లోని పోచమ్మ ఆలయం సమీపంలోని తమ గుడిసె నుండి హాస్పిటల్ కి వెళ్తుండగా అదృశ్యమయ్యాడని.... చుట్టుపక్కల ప్రాంతాలు వెతికినా అతని గురించి ఎటువంటి సమాచారం తెలియలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని బాలుడి కోసం దర్యాప్తు చేయగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి... దీంతో పోలీసులు వెంటనే ఈ కేసులో ప్రధాన నిందితుడి తో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుండి ఐదు లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.
సంగారెడ్డి జిల్లాకు చెందిన చిలుకూరి రాజు ఆయుర్వేద మెడికల్ ప్రాక్టీస్ చేస్తున్నాడు, సంగారెడ్డి జిల్లాకు చెందిన మొహమ్మద్ ఆసిఫ్ కూరగా యలు విక్రయిస్తూ ఉంటాడు. మెదక్ జిల్లాకు చెందిన శ్రీమతి రిజ్వానా, మూసాపేట్ కి చెందిన నరసింహారెడ్డి, సంగారెడ్డికి చెందిన బాలరాజు వీరందరూ ఒక ముఠాగా ఏర్పడి... పిల్లలను కిడ్నాప్ చేసి... ఇతరులకు విక్రయించే దందాకు తెర లేపారు... వీరందరూ రైల్వే స్టేషన్ మరియు ఏకాంత ప్రదేశాల్లో ఐదు సంవత్సరాల లోపు గల పిల్లలను గుర్తిస్తారు. కొన్ని రోజులుగా వారిపై నిఘా పెడతారు. అదును చూసి ఒంటరిగా ఉన్న చిన్న పిల్లలను కిడ్నాప్ చేసి తల్లిదండ్రులు లేని పిల్లలకు విక్రయిస్తూ వారి వద్ద నుండి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ విధంగా మీరందరూ పిల్లలు కిడ్నాప్ చేస్తూ ఉంటారు. వీరి వద్ద నుండి అమ్ములు, లాస్య, ఆది వీక్, ప్రియా, అరుణ్, అఖిల్ అనే ఆరుగురు పిల్లల్ని పోలీసులు రక్షిం చారు. కానీ అమ్ములు, లాస్య అనే ఇద్దరు అమ్మా యిల తల్లిదండ్రు లను గుర్తించలేక పోయారు... మిగిలిన నలుగురు పిల్లలను వారి వారి తల్లిదండ్రులకు అప్పగించారు... చందానగర్ పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 5 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు...