ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

జమ్మూ కశ్మీర్లోని గాందర్‌బల్ జిల్లా శ్రీనగర్-లెహ్ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది.

By Medi Samrat  Published on  5 Dec 2023 8:00 PM IST
ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

జమ్మూ కశ్మీర్లోని గాందర్‌బల్ జిల్లా శ్రీనగర్-లెహ్ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. జోజిలా పాస్ వద్ద కారు లోయలో పడి ఏడుగురు టూరిస్టులు దుర్మరణం పాల్యయారు. సమాచారం తెలిసిన వెంటనే సోనామార్గ్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో కారులో ఏడుగురు టూరిస్టులు, డ్రైవర్‌ ఉన్నారు. రోడ్డుపై దట్టమైన మంచు ఉండటంతో కారు స్కిడ్ అయి లోయలోకి పడినట్టు చెబుతున్నారు. మృతులంతా కేరళకు చెందిన వారిగా తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన కారు డ్రైవర్‌ను అజాద్ అహ్మద్ అవాన్‌గా గుర్తించారు. అతనిని స్కిమ్స్‌కు తరలించారు.

శ్రీనగర్-లేహ్ హైవేపై జోజిలా పాస్ సమీపంలో యాదవ్ మోర్ వద్ద కనీసం ఏడుగురు పర్యాటకులతో ఉన్న SUV ప్రమాదానికి గురై లోయలో పడిపోయిందని ఒక అధికారి గ్రేటర్ కాశ్మీర్‌కు తెలిపారు. ఈ ప్రమాదంలో వాహనం నడుపుతున్న డ్రైవర్‌తో సహా మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. వారిని పీహెచ్‌సీ సోనామార్గ్‌కు తరలించి అక్కడ నుంచి ప్రత్యేక చికిత్స కోసం స్కిమ్స్ సౌరాకు తరలించారు.

Next Story