బాపట్ల.. బీచ్‌లో స్నానానికి వెళ్లి న‌లుగురు యువ‌కులు గ‌ల్లంతు

బాపట్ల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని వెంకటాయపాలెం రామాపురం బీచ్ వ‌ద్ద స్నానానికి వెళ్లిన న‌లుగురు యువ‌కులు స‌ముద్రంలో గ‌ల్లంత‌య్యారు

By Medi Samrat  Published on  21 Jun 2024 6:00 PM IST
బాపట్ల.. బీచ్‌లో స్నానానికి వెళ్లి న‌లుగురు యువ‌కులు గ‌ల్లంతు

బాపట్ల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని వెంకటాయపాలెం రామాపురం బీచ్ వ‌ద్ద స్నానానికి వెళ్లిన న‌లుగురు యువ‌కులు స‌ముద్రంలో గ‌ల్లంత‌య్యారు. గ‌ల్లంతైన యువ‌కుల స్వ‌స్థ‌లం ఏలూరు జిల్లా దుగ్గిరాల గ్రామంగా స‌మాచారం అందుతుంది. గ‌ల్లంతైన ఐదుగురిలో తేజ(21), కిషోర్(22) అనే యువ‌కులు మృత‌దేహాలు తీరం ఒడ్డుకు కొట్టుకువచ్చాయి. మిగ‌తా ఇద్ద‌రు నితిన్(22), అమూల్ రాజ్(23) ల కోసం పోలీసులు గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఘ‌ట‌న‌పై పూర్తి వివ‌రాలు తెలియాల్సివుంది.

Next Story