తెల్లవారుజామున మహిళపై నలుగురు సామూహిక అత్యాచారం.. ఇద్దరు మైనర్లు అరెస్ట్‌

Four men sexually assault a woman in Mumbai at dawn. ముంబైలోని మహిళపై శనివారం, జనవరి 21, 2022 తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి

By అంజి  Published on  24 Jan 2022 11:33 AM IST
తెల్లవారుజామున మహిళపై నలుగురు సామూహిక అత్యాచారం.. ఇద్దరు మైనర్లు అరెస్ట్‌

ముంబైలోని మహిళపై శనివారం, జనవరి 21, 2022 తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న ఇద్దరు మైనర్‌లను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ప్రమేయమున్న మరో ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉండగా పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. మహిళ క్యాటరింగ్ కంపెనీలో పనిచేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. మహిళ ఇంటికి వెళుతుండగా ఆమెకు తెలిసిన నిందితుల్లో ఒకరు ఆమెను అడ్డుకున్నారు.ఇంత ఆలస్యంగా ఇంటికి ఎందుకు వస్తున్నారని ఆరా తీశారు. ఇంతలో మరో నిందితుడు తనతో పాటు వస్తావా అంటూ ఆమెను ఓ గదిలోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించే ప్రయత్నం చేశాడు.

నేరం గురించి ప్రజలను అప్రమత్తం చేయడానికి ఆమె గట్టిగా కేకలు వేసేందుకు ప్రయత్నించినప్పుడు, మరొకరు చేరి, ఆమె గొంతును బిగించి, ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. నేరం చేసిన తర్వాత నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ దారుణ ఘటన తర్వాత మహిళ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. టెక్నికల్ ఇంటెలిజెన్స్, బాధితురాలు అందించిన వివరణలను ఉపయోగించి నలుగురు నిందితుల గుర్తింపును పోలీసులు నిర్ధారించారు. ఇద్దరు మైనర్ టీనేజర్లు అదుపులో ఉన్నారని, పరారీలో ఉన్న మరో ఇద్దరు వ్యక్తుల కోసం అన్వేషణ జరుగుతోందని పోలీసు వర్గాలు ధృవీకరించాయి.

Next Story