కర్ణాటకలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన రాయ్‌బాగ్ ఏరియాలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. ఆ నలుగురు వ్యక్తులు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాళ్లోకెళితే.. రాయ్‌బాగ్ తాలుకలోని భీరాడి గ్రామానికి చెందిన అన్నప్ప, మహాదేవి దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు తెలిపారు.
మృతులు అన్నప్ప (60), మహాదేవి (50), దత్తాత్రేయ (28), సంతోష్ (26)ల ఆత్మహత్యకు గల పూర్తి కారణాలు తెలియరాలేదని పేర్కొన్నారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసుల ప్రాధమిక విచారణలో తేలింది. సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.