ఆదిలాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

Four killed in road accident in Adilabad District. అతివేగంగా వెళ్తున్న కారు ట్రక్కును ఢీకొనడంతో నలుగురు వ్యక్తులు మృతి చెందగా, మరో మహిళకు తీవ్రగాయాలయ్యాయి.

By అంజి
Published on : 31 Oct 2022 10:15 AM IST

ఆదిలాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

అతివేగంగా వెళ్తున్న కారు ట్రక్కును ఢీకొనడంతో నలుగురు వ్యక్తులు మృతి చెందగా, మరో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. నివేదికల ప్రకారం, ముగ్గురు పురుషులు మరియు ఇద్దరు మహిళలు సహా ఐదుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్న కారు ట్రక్కును ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు పురుషులు, ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన మహిళను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతులు ఆదిలాబాద్ వాసులుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

మరోవైపు హైదరాబాద్‌ నగర శివారులోని ఔటర్‌ రింగ్‌రోడ్డు సమీపంలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన టెంపో వాహనం లారీని ఢీకొట్టింది. కండ్లకోయ వద్ద జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో టెంపోలో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story