రోడ్డుప్ర‌మాదంలో న‌లుగురు సాప్ట్‌వేర్ ఇంజినీర్లు మృతి

కర్నాటకలోని మాండ్యా జిల్లా ఘోర రోడ్డు ప్ర‌మాదం సంభ‌వించింది.

By Medi Samrat  Published on  27 Sep 2023 9:38 AM GMT
రోడ్డుప్ర‌మాదంలో న‌లుగురు సాప్ట్‌వేర్ ఇంజినీర్లు మృతి

కర్నాటకలోని మాండ్యా జిల్లా ఘోర రోడ్డు ప్ర‌మాదం సంభ‌వించింది. బెంగుళూరు-మంగళూరు జాతీయ రహదారిపై బెల్లూరు క్రాస్ సమీపంలో బుధవారం వేగంగా వెళ్తున్న కారు.. కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ (కేఎస్‌ఆర్‌టీసీ) బస్సును వెనుక నుంచి ఢీకొట్టడంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో ఓ మహిళ, ముగ్గురు పురుషులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. నలిగిపోయిన కారులో నుంచి మృతదేహాలను బయటకు తీశారు. మృతి చెందిన వారిని సాప్ట్‌వేర్ ఇంజినీర్లుగా గుర్తించారు.

హాసన్ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న బస్సు ఆదిచుంచనగిరి మెడికల్ హాస్పిటల్ సమీపంలో ప్రయాణికులను దిగేందుకు ఆగడంతో ఈ ప్రమాదం జరిగింది. అతివేగంతో వెళ్తున్న కారు డ్రైవర్‌ వాహనంపై నియంత్ర‌ణ కోల్పోవ‌డంతో బస్సును వెనుక నుంచి ఢీకొట్టాడు. బెల్లూరు పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టారు. ప్ర‌మాద ఘ‌ట‌న‌పై పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Next Story