వికారాబాద్ జిల్లాలో విషాదం.. ఈత‌కు వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

Four Died in Kotpalli Project in Vikarabad. వికారాబాద్ జిల్లా కోటిపల్లి ప్రాజెక్టులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు యువకులు మృతి చెందారు.

By Medi Samrat
Published on : 16 Jan 2023 5:57 PM IST

వికారాబాద్ జిల్లాలో విషాదం.. ఈత‌కు వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
వికారాబాద్ జిల్లా కోటిపల్లి ప్రాజెక్టులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు యువకులు మృతి చెందారు. సంక్రాంతి పండుగను సరదాగా గడుపుదామని ఈతకు వెళ్లి మృత్యుఒడికి చేరుకున్నారు పండుగ వేళ వీరి కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మృతులు వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మన్నెగూడ గ్రామానికి చెందిన వారు.. మృతదేహాలను వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల‌ను జగదీష్, లోకేష్, రాజేష్, వెంకటేష్ గా గుర్తించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.


Next Story