Sangareddy : ఇద్దరు మృతి.. ఆ బావిలోని నీటిని తాగినందుకేనా.?

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ సమీపంలోని సంజీవరావుపేట గ్రామంలో కలుషితమై నీరు తాగి ఇద్దరు వ్యక్తులు మరణించారు

By M.S.R  Published on  14 Oct 2024 10:38 AM IST
Sangareddy : ఇద్దరు మృతి.. ఆ బావిలోని నీటిని తాగినందుకేనా.?

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ సమీపంలోని సంజీవరావుపేట గ్రామంలో కలుషితమై నీరు తాగి ఇద్దరు వ్యక్తులు మరణించారు. అంతేకాకుండా 100 మంది అస్వస్థతకు గురయ్యారు. ఇంకా 30 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. కొన్ని రోజుల క్రితం కుక్క కళేబరం లభించిన బావిలోని నీటిని తాగి గ్రామస్తులు అస్వస్థతకు గురయ్యారని స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ విషయాన్ని రెవెన్యూ అధికారులు ధృవీకరించలేదు.

మరణానికి గల కారణాలపై వైద్యుల నుంచి ఇంకా నివేదిక అందలేదని అధికారులు తెలిపారు. మృతులు సంజీవరావుపేటలోని బీసీ కాలనీకి చెందిన 25 ఏళ్ల బోడి మహేష్‌, వృద్ధురాలు సాయమ్మగా గుర్తించారు. ఇప్పటి వరకు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. వృద్ధాప్యం కారణంగా మహిళ చనిపోయి ఉండవచ్చని, యువకుడు అపెండిసైటిస్‌ కారణంగా మరణించి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అధికారులు.

Next Story