జైపూర్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. న‌లుగురు గుజ‌రాత్ పోలీసులు స‌హా ఐదుగురు దుర్మ‌ర‌ణం.. రాజ‌స్థాన్ సీఎం విచారం

Five people including four 4 Gujarat Police personnel killed in an accident in Jaipur.రాజ‌స్థాన్ రాష్ట్రంలో ఘోర రోడ్డు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 Feb 2022 6:03 AM GMT
జైపూర్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. న‌లుగురు గుజ‌రాత్ పోలీసులు స‌హా ఐదుగురు దుర్మ‌ర‌ణం.. రాజ‌స్థాన్ సీఎం విచారం

రాజ‌స్థాన్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో న‌లుగురు పోలీసులు స‌హా ఓ వ్య‌క్తి మొత్తం ఐదుగురు దుర్మ‌ర‌ణం చెందారు. గుజ‌రాత్ పోలీసులు ఓ నిందితుడిని ఢిల్లీ నుంచి గుజ‌రాత్ తీసుకువెలుతుండ‌గా జైపూర్‌లోని భ‌బ్రూ ప్రాంతంలో వారు ప్ర‌యాణీస్తున్న వాహ‌నాన్ని ఓ ట్ర‌క్కు ఢీకొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో వాహ‌నంలో ఉన్న న‌లుగురు గుజ‌రాత్ పోలీసుల‌తో పాటు ఓ వ్య‌క్తి అక్క‌డిక్క‌డే ప్రాణాలు కోల్పోయారు.

ఈ ప్ర‌మాదంపై స‌మాచారం అందుకున్న రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ విచారం వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాలకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని, మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. 'నిందితులను ఢిల్లీ నుండి గుజరాత్‌కు తీసుకువెళుతున్న గుజరాత్ పోలీసు వాహనం జైపూర్‌లోని భబ్రూ ప్రాంతంలో ప్రమాదానికి గురై నలుగురు పోలీసులతో సహా ఐదుగురు మరణించడం బాధాక‌రం. నా ప్రగాఢ సానుభూతి మృతుల కుటుంబాలకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని, మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. 'అని సీఎం అశోక్ గెహ్లాట్ ట్వీట్ చేశారు.

Next Story