ప్రజలపైకి దూసుకెళ్లిన బస్సు.. ఐదుగురు దుర్మరణం, 12 మందికి తీవ్రగాయాలు

Five killed, several injured by speeding bus in Kanpur. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై వేగంగా వెళ్తున్న

By అంజి  Published on  31 Jan 2022 8:22 AM IST
ప్రజలపైకి దూసుకెళ్లిన బస్సు.. ఐదుగురు దుర్మరణం, 12 మందికి తీవ్రగాయాలు

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై వేగంగా వెళ్తున్న ఓ బస్సు బీభత్సం సృష్టించింది. వేగంతో వస్తూ పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టాట్‌మిల్ క్రాసింగ్ వద్ద ఎలక్ట్రిక్ బస్సు అదుపు తప్పి వ్యక్తులపైకి దూసుకెళ్లడంతో ప్రమాదం జరిగింది. ట్రక్కును ఢీకొనడంతో బస్సు ఆగిపోయింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

బస్సు డ్రైవర్‌ వాహనంపై అదుపు తప్పి ప్రమాదకరంగా నడుపుతున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బస్సు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి.. నిందితుడు డ్రైవర్ పరారీలో ఉన్నాడు.. అతడి కోసం గాలిస్తున్నామని డీసీపీ ప్రమోద్ కుమార్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ ఘటనపై జాతీయ కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంకా గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Next Story