కడప జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీ, కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందారు. సి.కె.దిన్నె మండలం గువ్వల చెరువు ఘాట్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రాయచోటి నుంచి కడపకు కారులో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో చిన్నారి, ముగ్గురు మహిళలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. లారీ ఓవర్ స్పీడే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించినట్లు సమాచారం.