ఘోర ప్రమాదం.. లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

ప్రయాగ్‌రాజ్‌లో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. లారీ ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు.

By Medi Samrat  Published on  24 Jun 2024 11:42 AM IST
ఘోర ప్రమాదం.. లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

ప్రయాగ్‌రాజ్‌లో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. లారీ ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. సరయమ్మరేజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రస్తీపూర్ గ్రామంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

సారయమ్మరేజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రస్తీపూర్ గ్రామంలో సోమవారం ఉదయం 10 గంటల సమయంలో బైక్‌ను లారీ ఢీకొంది. దీంతో బైక్‌పై వెళ్తున్న భర్త, భార్య, ఇద్దరు చిన్న పిల్లలు, మరో మహిళ రోడ్డుపై పడిపోవడంతో లారీ వారిపై నుంచి వెళ్ల‌డంతో అందరూ నుజ్జునుజ్జయ్యారు.

ప్రమాదాన్ని చూసి దారిన వెళ్లేవారు షాక్‌కు గురయ్యారు. సమాచారం అందుకున్న సారయమ్మరేజ్ పోలీస్ స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం లారీ డ్రైవర్‌ను పట్టుకున్నారు. మృతులు మిర్‌గంజ్ జైన్‌పూర్ వాసుల‌ని పోలీస్ స్టేషన్ హెడ్ యోగేష్ ప్రతాప్ తెలిపారు. మృతుల‌ గుర్తింపు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్ల‌డించారు.

Next Story