కారును ఢీకొట్టిన ట్రక్కు.. ఐదుగురు దుర్మ‌ర‌ణం

Five killed as speeding truck collides with car in Maharashtra's Sangli. మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో వేగంగా వస్తున్న ట్రక్కు కారును ఢీకొనడంతో ఒకే కుటుంబానికి

By Medi Samrat  Published on  6 May 2023 2:45 PM IST
కారును ఢీకొట్టిన ట్రక్కు.. ఐదుగురు దుర్మ‌ర‌ణం

మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో వేగంగా వస్తున్న ట్రక్కు కారును ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు, డ్రైవర్ మృతి చెందారు. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో విజాపూర్-గుహగర్ రహదారిలోని జాత్ పట్టణం సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసు అధికారి శనివారం తెలిపారు. ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన కుటుంబం విజాపూర్ నుండి జాత్‌కు వెళుతోంది. కారు అమృతవాది ఫాటా వద్దకు చేరుకోగానే, వేగంగా వచ్చిన మట్టితో కూడిన ట్రక్కు కారును ఢీకొట్టిందని అధికారి తెలిపారు. బాధితులు జాత్‌ పట్టణానికి చెందిన వారని తెలిపారు.

మయూరి సావంత్ (38), ఆమె కుమారుడు శ్లోక్(8), తండ్రి నామ్‌దేవ్ (65), తల్లి పద్మిని (60), డ్రైవర్ దత్తా చవాన్ (40) అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారి తెలిపారు. ఘటన అనంతరం లారీ డ్రైవర్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. తదుపరి విచారణ కొనసాగుతోందని తెలిపారు.


Next Story