విషం తాగి ఐదుగురు ఆత్మహత్య.. సూసైడ్‌ నోట్‌లో ఏముందంటే..!

Five family members died by consuming poison.కర్ణాటకలో విషాద ఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు విషాం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. బెళగావి జిల్లా

By అంజి
Published on : 24 Oct 2021 9:25 AM IST

విషం తాగి ఐదుగురు ఆత్మహత్య.. సూసైడ్‌ నోట్‌లో ఏముందంటే..!

కర్ణాటకలో విషాద ఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు విషాం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. బెళగావి జిల్లా హుక్కేరి సమీపంలోని బొర్గాల్‌ గ్రామంలో తండ్రి సహా నలుగురు పిల్లలు శవాలై కనిపించారు. గత సంవత్సరం బ్లాక్‌ ఫంగస్‌తో భార్య జయక్క మరణించడంతో.. ఆ కుటుంబం తీవ్ర విషాదంలోకి వెళ్లినట్లు తెలిసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలంలో ఓ సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సూసైడ్‌ నోట్‌లో.. బ్లాక్‌ ఫంగస్‌తో భార్య చనిపోవడంతో తాను తీవ్రంగా కుంగిపోయానని భర్త హదిమిణి రాశాడని పోలీసులు చెప్పారు.

మృతులు మాజీ ఆర్మీ వ్యక్తి గోపాల్‌ దొడ్డప్ప హదిమణి (46), అతని పిల్లలు సౌమ్య (19), స్వాతి (16), సాక్షి (12), సృజన్‌ (10)గా పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తండ్రి తన పిల్లలకు విషం కలిపిన ఆహారాన్ని తినిపించి, ఆ తర్వాత తాను విషం తీసుకున్నాడు. అంత్యక్రియలో కోసం తాను రూ.20 వేలు పక్కన పెట్టానని, పోలీసుల సహాయంతో వాటిని నిర్వహించాల్సిందిగా ఇరుగుపొరుగు వారిని కోరినట్లు సూసైడ్‌ నోట్‌లో హదిమణి పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై జిల్లా ఇంచార్జి మంత్రి గోవింద్‌ కర్జోల్‌ సంతాపం తెలిపారు.

Next Story