విషాదం : ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య

Five Family Members committed For suicide. బీహార్‌లో దారుణం చోటు చేసుకుంది. ఒక కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యకు

By Medi Samrat  Published on  13 March 2021 5:22 AM GMT
విషాదం : ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య

బీహార్‌లో దారుణం చోటు చేసుకుంది. ఒక కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. బీహార్‌లోని సుసౌల్‌ జిల్లాలో ఒక కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. శుక్రవారం అర్థరాత్రి దాటిన ఈ ఘటన చోటు చేసుకున్నట్ట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాఘెపూర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని గద్దీలో ఉంటున్న ఒక కుటుంబంలోని భార్యభర్తలతో పాటు వారి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. గ్రామంలోని మిశ్రీలాల్ సాహ్(50) ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో గమనించిన స్థానికులు వెంటనే గ్రామ సర్పంచ్‌కు తెలియజేశారు. ఆయన స్థానికుల సహాయంతో ఇంటి తలుపులు బద్దలుకొట్టి లోనికి వెళ్లి చూడగా, ఇంట్లో ఒక గదిలో ఐదుగురి మృతదేహాలు ఉరితాళ్లకు వేలాడుతూ కనిపించాయి. దీంతో ఈ విషయాన్ని సర్పంచ్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టంనకు తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Next Story
Share it