నారాయణ పేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

నారాయణ పేట జిల్లా‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఢీకొన‌డంతో ఐదుగురు దుర్మరణం పాల‌య్యారు.

By Medi Samrat  Published on  24 Dec 2023 6:33 PM IST
నారాయణ పేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

నారాయణ పేట జిల్లా‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఢీకొన‌డంతో ఐదుగురు దుర్మరణం పాల‌య్యారు. 167 జాతీయ రహదారిపై ఈ ప్రమాదం సంభ‌వించింది. ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా జక్లేర్ వద్ద 167 జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న‌ రెండుకార్లు బలంగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక వాహనంలోని ఇద్దరు, మరో వాహనంలో ఉన్న ముగ్గురు అక్క‌డిక్క‌డే మృతిచెందారు. ఈ ప్ర‌మాదంలో మ‌రో న‌లుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఘ‌న‌ట‌పై సమాచారం అందుకున్న‌ పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతులను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను మక్తల్‌ ఆసుపత్రికి తరలించారు. మృతుల వద్ద ఉన్న ఆధార్‌ కార్డు, ఫోన్ల ఆధారంగా మహారాష్ట్ర, కర్ణాటక వాసులుగా గుర్తించామని పోలీసులు తెలిపారు.

Next Story