ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మ‌ర‌ణం

Five dead as car hits lorry at Amaravati-Anantapur National Highway. ప్రకాశం జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో

By Medi Samrat  Published on  8 Aug 2022 9:39 AM IST
ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మ‌ర‌ణం

ప్రకాశం జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. దైవ దర్శనానికి వెళ్తుండగా లారీని కారు ఢీకొట్టడంతో ప్ర‌మాదం జరిగింది. కంభం సమీపంలోని అమరావతి-అనంతపురం జాతీయ రహదారిపై ప్ర‌మాదం చోటుచేసుకుంది. మృతులంతా పల్నాడు జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం సిరిగిరిపాడుకు చెందిన ఐదుగురు కుటుంబ సభ్యులు తిరుపతి దైవ దర్శనానికి బయలుదేరారు. అమరావతి-అనంతపురం జాతీయ రహదారిపై కంభం వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా.. అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఈ ప్రమాదంలో మృతి చెందిన ఐదుగురు ఒకే కుటుంబానికి చెందిన నాగిరెడ్డి (24), అనంతమ్మ (50), గురమ్మ (70), అనిమిరెడ్డి (75), ఆదిలక్ష్మమ్మ (70)గా పోలీసులు గుర్తించారు.


Next Story