ఘోర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

Five dead after car plunges into irrigation canal in Siddipet. సిద్ధిపేట జిల్లా జగదేవ్‌పూర్‌లోని మునిగడప వద్ద మల్లన్న దేవాలయం సమీపంలో మంగళవారం కారు

By Medi Samrat  Published on  10 Jan 2023 6:21 PM IST
ఘోర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

సిద్ధిపేట జిల్లా జగదేవ్‌పూర్‌లోని మునిగడప వద్ద మల్లన్న దేవాలయం సమీపంలో మంగళవారం కారు అదుపు తప్పి కేఎల్‌ఐఎస్ కెనాల్‌లోకి దూసుకెళ్లడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మారుతీ ఆల్టో కారులో ముగ్గురు మహిళలు, ఒక బాలుడు సహా ఆరుగురు ప్రయాణిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు కారులోంచి ఐదు మృతదేహాలను వెలికితీసి.. తీవ్ర గాయాలపాలైన ఒక ప్రయాణికుడిని గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతులను సమ్మయ్య, స్రవంతి, లోకేష్, రాజమణి, భవ్యశ్రీ గుర్తించారు. వేములవాడ పుణ్యక్షేత్రానికి వెళ్లి తిరిగి బీబీనగర్ కు వెళ్తున్న క్ర‌మంలో కారు ప్ర‌మాదం జ‌రిగ‌న‌ట్లు తెలుస్తోంది. ఘ‌ట‌న‌పై పూర్తి వివ‌రాలు తెలియాల్సివుంది.


Next Story