రాష్ట్రంలో డబుల్ డెక్కర్ బస్సులో మంటలు..ఐదుగురు సజీవదహనం

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు సజీవ దహనం అయ్యారు.

By Knakam Karthik
Published on : 15 May 2025 9:09 AM IST

Crime News, National News, Uttarpradesh, LucknowFire, DoubleDeckerBus

రాష్ట్రంలో డబుల్ డెక్కర్ బస్సులో మంటలు..ఐదుగురు సజీవదహనం

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు సజీవ దహనం అయ్యారు. గురువారం తెల్లవారుజామున మోహన్‌లాల్‌గంజ్ సమీపంలని కిసాన్ పథ్ వద్ద ఢిల్లీ నుంచి బిహార్ వెళ్తోన్న ఓ డబుల్ డెక్కర్‌ బస్సులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనా సమయంలో బస్సులో దాదాపు 60 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

అయితే, బస్సులో అకస్మాత్తుగా పొగ వ్యాపించడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్థానికులు, ప్రయాణికులు పోలీసులకు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. అయితే, డ్రైవర్ కేబిన్ వద్ద అదనంగా సీటు ఏర్పాటు చేయడం వల్ల ప్రయాణికులు బయటికి రావడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. బస్సులోని ముందు వైపు ప్రయాణికులు బయటికి రాగలిగారు.

మరో వైపు బస్సు ఎమర్జెన్సీ గేట్ పనిచేయకపోవడం వల్ల వెనుక కూర్చున్న ప్రయాణికులు బయటికి రాలేకపోయారని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది. అగ్ని ప్రమాదం మొదలైన 10 నిమిషాల్లోనే మొత్తం బస్సు పూర్తిగా కాలిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో డ్రైవర్, కండక్టర్ బస్సు నుంచి దూకి పరారయ్యారు. ఆరు ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకొని గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story