నైరుతి ఢిల్లీలోని ఘుమాన్ హేరా ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీలో బుధవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదం విషయమై తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో అగ్నిమాపక శాఖకు సమాచారం అందింది. సమాచారం మేరకు వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆయిల్ ట్యాంకర్‌లో మంటలు చెలరేగాయని.. అది పెను ప్రమాదంగా మారే అవకాశం ఉందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రమాద తీవ్రతను పరిగణనలోకి తీసుకుని వెంటనే మరిన్ని ఫైర్ ఇంజన్లను పిలిపించారు. మంటలను ఆర్పేందుకు దాదాపు పది అగ్నిమాపక యంత్రాలు రంగంలోకి దిగాయి.
రెండు గంటల్లో మంటలు అదుపులోకి వచ్చాయి. ప్రాణనష్టం జరగకుండా అగ్నిమాపక శాఖ ఫ్యాక్టరీని ఖాళీ చేయించింది. ఈ సంఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. అగ్నిమాపక సిబ్బందికి సహాయం చేసేందుకు స్థానిక పోలీసులు కూడా అగ్నిమాపక స్థలానికి చేరుకున్నారు. ఉదయం 7:30 గంటల సమయానికి మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు" అని అగ్నిమాపక అధికారి తెలిపారు. ఈ ఘటనలో జరిగిన మొత్తం నష్టాన్ని స్థానిక పోలీసులు అంచనా వేసి ఫ్యాక్టరీ యాజమాన్యం వాంగ్మూలాన్ని నమోదు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి ఉండవచ్చని అగ్నిమాపక అధికారి తెలిపారు.