రాజేంద్రనగర్‌లో భారీ అగ్నిప్రమాదం

Fire Accident In Rajendra Nagar. రాజేంద్రనగర్ కాటేదాన్ ఒమర్ ట్రేడర్ ప్లాస్టిక్ వేస్టేజ్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభ‌వించింది.

By Medi Samrat
Published on : 10 Nov 2022 1:18 PM IST

రాజేంద్రనగర్‌లో భారీ అగ్నిప్రమాదం
రాజేంద్రనగర్ కాటేదాన్ ఒమర్ ట్రేడర్ ప్లాస్టిక్ వేస్టేజ్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభ‌వించింది. ఒక్కసారిగా చెలరేగిన మంటలు మంటలను చూసి కార్మికులు అక్క‌డి నుండి బయటకు పరుగులు తీశారు. ప్ర‌మాదంపై స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. ప్ర‌మాదంలో ఎటువంటి ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌లేదు. పది లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. విద్యుతాఘాతం కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఎటువంటి అనుమ‌తులు లేకుండా పరిశ్రమ న‌డుపుతున్నార‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్ర‌మాద ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Next Story