మదనపల్లిలో అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం
Fire Accident In Madanapalle. జిల్లా కేంద్రంలోని మదనపల్లి పట్టణంలో హోల్ సేల్ కిరాణ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం
By Medi Samrat Published on
8 Feb 2021 3:42 AM GMT

చిత్తూరు : జిల్లా కేంద్రంలోని మదనపల్లి పట్టణంలో హోల్ సేల్ కిరాణ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక అప్పారావు వీధికి చెందిన ప్రదీప్ ట్రేడర్స్ లో ఈ ప్రమాదం జరిగింది. దుకాణంలో హోల్ సేల్ గా నిత్యవసర వస్తువులు, దినుసులు విక్రయాలు సాగిస్తున్నారు. ప్రమాదం సంభవించడంతో దుకాణంలో ఉన్న సుమారు రెండు కోట్లు వరకూ సరుకు దెబ్బతినే అవకాశముంది.
సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఒక్కసారిగా దుకాణంలో నుంచి పొగలు రావడం గమనించిన స్థానికులు యజమానికి, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు గంటలుగా మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. దుకాణంలో నూనె బారెల్స్ ఉండటంతో మంటలు త్వరగా వ్యాపించాయనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదంలో సుమారు కోటి రూపాయల వరకూ ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా.
Next Story