కాబోయే భర్త అనుమానపు వేధింపులు.. యువతి బలవన్మరణం.!

Fianc harassment before marriage .. Young woman commits suicide. ఆ యువతికి వివాహం నిశ్చయమైంది. పెళ్లి పీటలు ఎక్కి కొత్త జీవితంలోకి అడుగుపెట్టడమే తరువాయి. కానీ అలా జరగలేదు.

By అంజి  Published on  14 Nov 2021 12:36 PM IST
కాబోయే భర్త అనుమానపు వేధింపులు.. యువతి బలవన్మరణం.!

ఆ యువతికి వివాహం నిశ్చయమైంది. పెళ్లి పీటలు ఎక్కి కొత్త జీవితంలోకి అడుగుపెట్టడమే తరువాయి. కానీ అలా జరగలేదు. పెళ్లి జరగడానికి ముందే ఆమెకు ఆయుష్షు తీరిపోయింది. కాబేయే భర్త అనుమానంగా చూడటంతో యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. కాబోయే వాడే.. తనను అనుమానంతో చూడటంతో మనస్తాపానికి గురైంది. అతడితో జీవితం పంచుకునేందుకు ఇష్టం లేక ఆత్మహత్యకు పాల్పడింది. హావేరికి చెందిన అభినందన్‌తో హుబ్లీ ప్రశాంత్‌నగర్‌కు చెందిన పవిత్ర పాటిల్‌కు పెళ్లి నిశ్చయం అయ్యింది. డిసెంబర్‌ 2వ తేదీన వీరి వివాహం జరగాల్సి ఉంది.

ఈ క్రమంలోనే దాండేలికి పవిత్రను అభినందన్‌ ప్రీ వెడ్డింగ్‌ షూట్‌కు తీసుకెళ్లాడు. ఆ రోజు నుండి యువతిపై అనుమానం వ్యక్తం చేస్తూ అభినందన్‌ వేధింపులకు గురిచేయసాగాడు. ఈ విషయాన్ని పవిత్ర తన కుటుంబ సభ్యులకు తెలిపింది. వివాహం అయితే అన్ని సర్దుకుపోతాయని, అలాంటి ఏవీ కూడా మనసులో పెట్టుకోవద్దంటూ పవిత్రను తల్లిదండ్రులు ఓదార్చారు. అప్పటికీ అభినందన్‌ వేధింపులు ఆగలేదు. దీంతో యువతి తీవ్ర మనస్తాపానికి గురైంది. శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. యువతి కాబోయే భర్త అభినందన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

Next Story