ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బులంద్‌షహర్‌లోని దిబాయి ప్రాంతంలో హృదయ విదారక సంఘటన జరిగింది. తండ్రి మరణించిన కొద్దిసేపటికే కుమార్తె కూడా మరణించింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరిని కోల్పోవడంతో ఆ కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది.
మథూరియా ఇంటర్ కాలేజీలో పనిచేస్తున్న 55 ఏళ్ల ఉద్యోగి లక్ష్మీనారాయణ్ రావల్, ఆదివారం రాత్రి సుమారు 9:30 గంటలకు నైట్ డ్యూటీ కోసం తన బైక్‌పై కాలేజీకి వెళ్తుండగా, నరోరా టోల్ ప్లాజా సమీపంలో అకస్మాత్తుగా ఒక ఎద్దును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మరణించాడు.
ఈ ఘోర ప్రమాద వార్త ఇంటికి చేరగానే 17 ఏళ్ల చిన్న కూతురు మమత.. తండ్రి మరణ వార్త విని తట్టుకోలేక గుండెపోటుతో మరణించింది. తండ్రీకూతుళ్లిద్దరూ ఒకే రాత్రి మరణించడంతో గ్రామం మొత్తం విషాదంలో మునిగిపోయింది, ఆ కుటుంబం దుఃఖాన్ని ఆపుకోలేకపోతోంది.