కూతురిని చంపిన తండ్రి
హైదరాబాద్ చందానగర్‌లో దారుణ ఘటన జరిగింది. నాలుగవ తరగతి చదువుతున్న కూతురిని
By Medi Samrat Published on 19 Aug 2023 9:29 PM ISTహైదరాబాద్ చందానగర్‌లో దారుణ ఘటన జరిగింది. నాలుగవ తరగతి చదువుతున్న కూతురిని ఓ తండ్రి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. బీహెచ్ఈఎల్ జ్యోతి స్కూల్ లో నాలుగవ తరగతి చదువుతున్న మోక్షజ(8)ను తండ్రి చంద్రశేఖర్ పెన్సిల్ బ్లేడ్‌తో గొంతుకోసి చంపేశాడు. అనంతరం పాప మృతిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. పెద్దఅంబర్ పేట్ ఓఆర్ఆర్ వద్ద కారుకు ప్రమాదం కావడంతో విషయం వెలుగుచూసింది.
భార్య హిమతో మనస్పర్ధల కారణంగా విడిగా ఉంటున్న నిందితుడు చంద్రశేఖర్ మూడు రోజులకు ఒకసారి పాపని చూడటానికి వెళ్తుంటాడు. ఈ క్రమంలోనే మయమాటలు చెప్పి పాపను వెంట తీసుకెళ్లిన చంద్రశేఖర్ దారుణంగా హత్యచేశాడు. అనంతరం నాలుగున్నర గంటల సమయంలో ఓఆర్ఆర్ పైకెక్కిన నిందితుడు చంద్రశేఖర్.. ఓఆర్ఆర్ పై డివైడర్‌ను ఢీ కొట్టి యాక్సిడెంట్ గా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. అనుమానాస్పదంగా తిరుగుతూ ఉండడంతో అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద అంబర్పేట్ ఓఆర్ఆర్ వద్ద పోలీసులు చంద్రశేఖర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మోక్షజ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.